నాపై అక్రమ కేసులు ... ఎమ్మెల్యే భూ అక్రమాలను బయటపెడతా : మాజీ బిజేపి జాతీయ కోశాధికారి పీఎం సాయి ప్రసాద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తనపై నమోదైన కేసులు పూర్తిగా తప్పుడువని కొట్టిపారేశారు మాజీ బీజేపీ జాతీయ కోశాధికారి పీఎం సాయి ప్రసాద్.
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రోహిత్ భూ ఆక్రమణలు, మెదక్‌లో నడుస్తున్న డ్రగ్ తయారీ యూనిట్, ఇతర అక్రమాలను బయటపెడతానని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే, ఆయన అనుచరుల భూ కుంభకోణాలు, అక్రమ కార్యకలాపాలను త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు.
రోహిత్ ఎన్నికల్లో కేవలం ఫ్లూక్‌గా 'వన్ టైమ్ వండర్' లా గెలిచారని, మళ్లీ ఎప్పటికీ గెలవరని పేర్కొన్నారు.
బీసీలు, బహుజనులతో కలిసి మెదక్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.





