2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారతదేశపు తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. 2027 చివరి త్రైమాసికంలో సూరత్-వాపి మధ్య తొలి సర్వీస్ ప్రారంభం కానుంది.
456 కిలోమీటర్ల పిల్లర్ పనులు, 371 కిలోమీటర్ల వయాడక్ట్ నిర్మాణం పూర్తయ్యాయి.
థానే క్రీక్ దగ్గర దేశంలోనే తొలి అండర్ సీ టన్నెల్ నిర్మాణం వేగంగా జరుగుతోంది.
ఐసీఎఫ్, బిఈఎంఎల్ ఆధ్వర్యంలో 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే స్వదేశీ బి28 ట్రైన్ సెట్లు సిద్ధమవుతున్నాయి.
మహారాష్ట్రలో భూసేకరణ సమస్యలు, కొవిడ్ వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైందని మంత్రి వివరించారు.





