తండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!

గుంటూరుకు చెందిన రాంబాబు, లక్ష్మీ సుజాత దంపతుల కుమార్తె వరలక్ష్మి అమెజాన్‌లో ఏడాదికి రూ.46 లక్షల ప్యాకేజీతో డేటా ఇంజినీర్ ఇంటర్న్‌గా ఎంపికైంది. తండ్రి కూలీ పనులు, తల్లి టైలరింగ్ చేస్తూ కష్టపడి చదివించగా, వరలక్ష్మి పట్టుదలతో ఈ విజయం సాధించింది.
ఆమె గుంటూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీవీఐటీ)లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివింది.
తన విజయంలో అన్న చంద్రశేఖర్ పవన్ కుమార్ ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడ్డాయని వరలక్ష్మి తెలిపింది.
అదే కాలేజీకి చెందిన కుసుమ అనే విద్యార్థిని కూడా అమెజాన్‌లో ఏడాదికి రూ.46 లక్షల ప్యాకేజీతో ఎంపికైంది.
వీవీఐటీ ఛైర్మన్ విద్యాసాగర్ ఇద్దరు విద్యార్థినులను అభినందించారు.
ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా సిద్ధమవుతూ, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చని వరలక్ష్మి అభిప్రాయపడింది.





