డ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత సైన్యం డ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల వాడకంపై డ్రోన్ ఫెడరేషన్ ఇండియా సంచలన నివేదిక ఇచ్చింది.
2021 నుంచి 2026 మధ్య 689 డ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల వాడకాన్ని గుర్తించారు.
వీటిలో 84 శాతం టెండర్లు ఆర్మీ యూనిట్లవేనని నివేదిక స్పష్టం చేసింది.
2025లో 190 టెండర్లు జారీ కాగా, 2026 నవంబర్ 19 నాటికే 355 టెండర్లు జారీ అయ్యాయి.
450 టెండర్లలో DJI, RadioMaster కంపెనీల విడిభాగాలను అసెంబ్లింగ్ కోసం వాడుతున్నారు.
చైనా ఎగుమతి లైసెన్స్ నిబంధనలతో డ్రోన్ల సరఫరాకు బ్రేక్ పడే ప్రమాదం ఉందని డ్రోన్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
చైనా విడిభాగాలపై నిషేధం విధించాలని, మేడ్ ఇన్ ఇండియా పార్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ప్రతి టెండర్‌లో తయారీ దేశం వివరాలను తప్పనిసరి చేయాలని నివేదిక సూచించింది.





