తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పైనుంచి వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారని టీడీపీ ఆరోపించింది. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పెద్దారెడ్డి పై చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది.
కేతిరెడ్డి పెద్దారెడ్డి దగ్గరుండి రాళ్లు వేయిస్తున్న వీడియోలను జేసీ వర్గీయులు విడుదల చేశారు. వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారని ఇరు వర్గీయులపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. బాణాసంచా పేల్చడం వల్ల నిప్పురవ్వలు చెలరేగి కార్లు, బైకులు దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు.





