ఈడీ రైడ్స్ మీద స్పందించిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిర్మల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంట్లో ఉదయం నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
సీఎంఆర్ రైస్ మిల్ కేసు విషయంలోనే ఈ సోదాలు జరుగుతున్నాయి. సోదాలకు సహకరించాను.
రాష్ట్రంలో 142 మంది రైస్ మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. తనపై మాత్రమే సోదాలు జరగడం బాధాకరమని రేఖానాయక్ పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో పాడి టెండర్ వల్ల 12 కోట్లు నష్టం వాటిల్లింది. వడ్లు పిండిగా మారడం వల్ల ఈ నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని చెల్లించాం. సీఎంఆర్ రైస్ కేసు కోర్టులో కొనసాగుతోంది.
15 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్నానని, 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని రేఖానాయక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యాపారం పట్టించుకోలేదని, రైస్ మిల్ తన పేరు మీద ఉండటంతోనే ఈడీ వచ్చిందని ఆయన తెలిపారు.





