నిర్మల్‌లో వివాహిత ఆత్మహత్యాయత్నం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిర్మల్ జిల్లా కేంద్రంలో కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రవళిక అలియాస్ సంగీతకు, నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం నేతాజీనగర్‌కు చెందిన రవితో వివాహమైంది. రవి ప్రభుత్వ గురుకుల కళాశాల్లో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరుగుతుండటంతో సఖి కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం కౌన్సెలింగ్ సమయంలోనూ వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
అనంతరం ప్రవళిక శివాజీ చౌక్‌లో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు, ఒక చేయి విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి.
గతంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను కాపాడారు.





