టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
హైదరాబాద్ టోలిచౌకి పోలీస్ స్టేషన్ సీఐ ఎల్. రమేష్ నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.
టోలిచౌకిలో హోటల్ నడుపుతున్న వ్యక్తి నుంచి రాత్రి 1 గంట దాటాక హోటల్ నడిపేందుకు నెలకు రూ. 50,000 లంచం డిమాండ్ చేశారు.
అక్టోబర్ 31న ఫిర్యాదుదారు ఏసీబీని ఆశ్రయించగా, ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇవాళ రాత్రి 9:40 గంటలకు రూ. 20,000 తీసుకుంటుండగా ట్రాప్ అమలు చేశారు.
సీఐ క్యాబిన్‌లోని బ్యాగులో రూ. 20,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా సీఐ క్యాబిన్‌లో సోదాలు చేయగా రూ. 1,00,000, రూ. 15,000, రూ. 50,000, రూ. 20,000 ఉన్న నాలుగు కవర్లు బయటపడ్డాయి.
స్వాధీనం చేసుకున్న అదనపు నగదు ఎవరి నుంచి సేకరించారనే అంశంపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.
అంతర్గత చర్యలను ఉన్నతాధికారులు తీసుకుంటారు, ఫిర్యాదుదారు గుర్తింపు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.
సీఐ క్యాబిన్ నుంచి మొత్తం రూ. 1.85 లక్షల అదనపు నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది.





