రియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.

మాగ్నస్ ఎలైట్ హోమ్స్‌లో 38 మంది సభ్యులకు కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు..
శంకర్‌పల్లిలోని జస్విత ఎస్టేట్స్ కొనుగోలుదారుకు 47 లక్షలు.. 10.85 శాతం వడ్డీతో సహా 60 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశం..
గూగీ శాటిలైట్ టౌన్‌షిప్‌లో కొనుగోలుదారుకు బకాయి ఉన్న 18.80 లక్షలు.. 10.85 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశాలు..
ఎస్‌వీ ఎలక్ట్రానిక్ సిటీ-3లో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో 6.10 లక్షలు 10.85 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని బీవీఆర్ ఇన్‌ఫ్రాకు ఆదేశం..
పోచారంలోని రాకెట్రీ విల్లా ప్రాజెక్టుపై రెరా సీరియస్.. అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా విల్లాల విక్రయాలు చేపట్టవద్దని హెచ్చరిక..
రాకెట్రీ విల్లా ప్రాజెక్టులో గతంలోనే రూ.22.95 లక్షల జరిమానా విధించిన రెరా.. నిబంధనలు కొనసాగితే డిఫాల్టర్‌గా ప్రకటించే అవకాశం..
పుప్పాలగూడలోని సుధీష డింపుల్ వ్యాలీకి భారీ షాక్.. కొనుగోలుదారుకు 10 లక్షలు వడ్డీతో తిరిగి చెల్లించాలని, అదనంగా 8.24 లక్షల జరిమానా విధింపు..
ఆర్‌డీబీ కోకోనట్ గ్రోవ్‌పై రోజుకు 1,000 చొప్పున జరిమానా.. ఇప్పటివరకు రూ.5.34 లక్షలకు చేరిన పెనాల్టీ..
కపిల్ బిజినెస్ పార్క్‌లో కొనుగోలుదారుకు రూ.24.64 లక్షలు 60 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశాలు..
గాజులరామారంలోని శ్రీ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలుదారులకు రెండు కార్ పార్కింగ్ స్థలాలు కేటాయించాలని ఆదేశం..
తూంకుంటలోని సిగ్నేచర్ టవర్స్‌లో ఫ్లాట్ బుకింగ్ కోసం వసూలు చేసిన 9 లక్షలు తిరిగి ఇవ్వాలని ఆదేశాలు..
బీబీనగర్ రాయన్ ఎన్‌క్లేవ్‌లో వసూలు చేసిన రూ.లక్ష బుకింగ్ అమౌంట్ 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశం..
ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో రెరా నమోదు లేకుండా ప్లాట్ల విక్రయాలు.. బాధ్యులకు 57,735 జరిమానా..
గోపన్‌పల్లిలోని హనర్ అక్వాంటిస్‌లో ఒకే పార్కింగ్ స్థలాన్ని ఇద్దరికి కేటాయించడంపై రెరా ఆగ్రహం.. 60 రోజుల్లో పార్కింగ్ కేటాయించాలని ఆదేశం..
అయ్యప్ప శ్రీ రస్తు ప్రాజెక్టులో సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీ, జనరేటర్ బ్యాకప్ లోపాలు.. 60 రోజుల్లో సొంత ఖర్చులతో సౌకర్యాలు కల్పించాలని ఆదేశం..
బిల్డర్లు రెరా ఆదేశాలను అమలు చేయకపోతే సెక్షన్ 63 కింద జరిమానాలు, తదుపరి చర్యలు తప్పవని హెచ్చరిక..





