ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు స్ట్రింగర్ పరిధిలోని విస్సన్నపేట మండలం కొండ పర్వలో పెద్దపులి సంచరిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు పహరా కాస్తున్నారు.
రాత్రి వేళల్లో ఎవరు ఒంటరిగా బయటికి రావద్దని, గుంపులుగా శబ్దం చేసుకుంటూ రావాలని గ్రామస్తులకు ఏసిపి అవగాహన కల్పించారు. రాత్రి వేళల్లో పోలీసులు ఆ ప్రాంతంలో పహరా కాస్తున్నారు.
అటవీ శాఖ అధికారులు, పోలీసులు డ్రోన్ సహాయంతో పెద్దపులి కోసం గాలిస్తున్నారు. ఈరోజు లేదా రేపటిలోపు పులిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
పులి సంచరించే మార్గంలో భారీ గేట్లు పెట్టి, రాకపోకలు నిషేధమని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.





