దశాబ్దం తర్వాత హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ గ్రాండ్ రీఎంట్రీ!
హైదరాబాద్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఐకానిక్ సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలంలో 'ఏఎంబీ విక్టరీ సినిమాస్' సిద్ధమైంది.
ఏషియన్ సినిమాస్ సంస్థతో టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్ బాబు, వెంకటేశ్ భాగస్వామ్యంతో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు.
మొత్తం 7 స్క్రీన్లతో ఈ కాంప్లెక్స్ రూపుదిద్దుకుంది.
4K లేజర్ ప్రొజెక్షన్, 12-ఛానల్ సౌండ్ ఉన్న 'ఐమ్యాక్స్ విత్ లేజర్' స్క్రీన్ ఇందులో ప్రధాన ఆకర్షణ.
అదనంగా మోషన్ సీట్లు ఉండే ఒక 4DX స్క్రీన్, డాల్బీ అట్మాస్, డాల్బీ 7.1 సౌండ్ ఉన్న మరో 5 సాధారణ స్క్రీన్లు ఉన్నాయి.
డిసెంబర్ 18, 2026న ఈ థియేటర్ ప్రారంభం కానుంది.
తొలి చిత్రంగా హాలీవుడ్ మూవీ 'డ్యూన్: పార్ట్ త్రీ' ప్రదర్శితమయ్యే అవకాశం ఉంది.
ఐమ్యాక్స్ కార్పొరేషన్, ఏషియన్ సినిమాస్ ఒప్పందంలో భాగంగా హకీంపేటలోని ఏఎంబీ సినిమాస్‌లోనూ మరో భారీ ఐమ్యాక్స్ స్క్రీన్ ఏర్పాటు కానుంది.





