కేంబ్రిడ్జ్ జ్ఞాపకాలను పంచుకున్న రాహుల్ గాంధీ
'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ మొదటిసారి కలుసుకున్న వర్సిటీ రెస్టారెంట్‌కు తాను తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లినట్లు రాహుల్ గాంధీ తెలిపారు.
రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ మొదటిసారి కలుసుకున్న ప్రదేశం అదేనని పేర్కొన్నారు.
అక్కడికి వెళ్లినప్పుడు సిబ్బంది తమకు సీటు చూపించారని, తన తల్లిదండ్రులు అక్కడ కలుసుకున్నారని చెప్పగానే ఆ సిబ్బంది వారిని గుర్తుపట్టారని, వారు సూచించిన చికెన్ చాసర్‌ను తాము రెండు ఆర్డర్ చేశామని చెప్పారు.
ప్రేమలో పడాలంటే వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లాలని, కానీ చికెన్ చాసర్ మాత్రం తినవద్దని రాహుల్ గాంధీ జోక్ చేశారు.
సిబ్బంది సూచన మేరకు చికెన్ చాసర్ ఆర్డర్ చేశామని, అది చాలా దారుణంగా ఉందని చెప్పారు.
తల్లిదండ్రులకు అక్కడి ఆహారం అద్భుతంగా అనిపించినా, తనకు మాత్రం నచ్చలేదని నవ్వుతూ చెప్పారు.
పుస్తక ఆవిష్కరణలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్న రాహుల్ గాంధీ.





