తమ్ముడికి పెళ్లి చేశారు.. తనకు చేయలేదని కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన పెద్ద కొడుకు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువు రాజీవ్ కాలనీలో ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయకుండా తమ్ముడికి వివాహం జరిపించారనే కోపంతో పెద్ద కుమారుడు సురేంద్ర తల్లితో తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో తల్లి ఇంట్లో లేని సమయంలో సురేంద్ర పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంటల్లో ఇంటి సామగ్రి కాలిబూడిద కాగా, ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.





