పులివెందులలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పులివెందులలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కడప జిల్లా పులివెందులలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
తెల్లవారుజాము నుంచే ఇరు వర్గాలు దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి.
ఎర్రగుడిపాలెం, గర్ల్స్ హై స్కూల్, అహోబిలాపురం పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి.
తెల్లవారుజాము నుంచే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఓటర్లను అడ్డుకుంటున్నారని వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు.
పోలీసులు అల్లరి మూకలను చెదరగొడుతున్నా, మళ్లీ దాడులు చేసుకుంటున్నారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైయస్ ప్రమీల ఆరోపించారు.





