పులివెందులలో అరాచకం.. బిటెక్ రవి హౌస్ అరెస్ట్, పుత్తా సంచలన ఆరోపణలు

పులివెందులకు జగన్‌మోహన్ రెడ్డి వస్తున్నారన్న నెపంతో తనను హౌస్ అరెస్ట్ చేశారని టీడీపీ ఇంచార్జ్ బిటెక్ రవి తెలిపారు.
రాష్ట్ర నలుమూలల నుంచి గుండాలను రప్పించి పులివెందులలో అరాచకం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
వెంకటపురం, టి.వెలమాలపల్లి, గర్ల్స్ హైస్కూల్ జూనియర్ డిగ్రీ కాలేజీలలో యథేచ్ఛగా రిగ్గింగ్ జరుగుతోందని పేర్కొన్నారు.
వైసీపీ గుండాలు కర్రలు, కత్తులతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అవినాష్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి ప్రతి బూత్‌లో రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తున్నారని బిటెక్ రవి ఆరోపించారు.
మరోవైపు, పులివెందులలో జగన్ మార్క్ రాజకీయం నడుస్తోందని టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మండిపడ్డారు.
తాను ఆఫీసులో ఉంటే, పులివెందులలో ఉన్నానని ఎంపీ అవినాష్ రెడ్డి అంటున్నారని ఆయన తెలిపారు.
ఓటమి భయంతో వైసీపీ నేతలు తమపై అభాండాలు వేస్తున్నారని, బయటి నుంచి రౌడీలను పిలిపించుకున్నారని పుత్తా చైతన్య రెడ్డి ఆరోపించారు.
ఎన్నికలను సక్రమంగా జరిపించాలని ఆయన కోరారు.





