క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.

రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సామాన్య ఓటరుగా క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెనాలిలోని శ్రీ రావి సాంబయ్య పురపాలక బాలుర ఉన్నత పాఠశాల (బాయ్స్ హైస్కూల్)లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 9/4 బూత్, 9వ వార్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అదేవిధంగా కూటమి తరఫున పోటీ చేస్తున్న జనసేన చైర్మన్ అభ్యర్థి తోటకూర వెంకట రమణారావు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో తమకు లభించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ అమూల్యమైన ఓటును వేయాలని కోరారు.
ఇదిలా ఉండగా... ఉదయం 9 గంటల వరకు తెనాలి పట్టణంలో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
పురుష ఓటర్లు వేసిన ఓట్లు: 7,634
మహిళా ఓటర్లు వేసిన ఓట్లు: 6,310
మొత్తం పోలైన ఓట్లు: 13,944
మొత్తం ఓటర్లు: 1,57,089
పోలింగ్ శాతం: 9 శాతం





