సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.
మొత్తం రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో రూ.451.13 కోట్ల పనులకు శంకుస్థాపనలు, రూ.92.98 కోట్ల పనుల ప్రారంభోత్సవాలు జరిగాయి.
దుబ్బాక, సిద్ధిపేటలో రూ.200 కోట్ల చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు.
ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఆరు తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి రూ.13.50 కోట్లతో శంకుస్థాపన చేశారు.
చిన్నకోడూరు, దౌల్తాబాద్ మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు. జనగామ నియోజకవర్గంలో మూడు విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.
సిద్ధిపేట జిల్లాలో రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో వసతి సత్రం, క్యూ కాంప్లెక్స్ ప్రారంభించారు. రూ.6.50 కోట్లతో 53 గ్రామ మహిళా సంఘాల భవనాలను ప్రారంభించారు.
రాయపోల్‌లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం, గజ్వేల్‌లో విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం ప్రారంభించారు.





