మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ పోస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికారం ఉందన్న అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు క్షమించరని ఆయన పేర్కొన్నారు.
అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో అవినీతికి పాల్పడుతూ, ప్రజావసరాలను విస్మరించి పాలన సాగించే వారిని తెలంగాణ ప్రజలు, చరిత్ర ఎన్నటికీ క్షమించవని స్పష్టం చేశారు.
ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ధర్మంగా, నిజాయితీగా పాలన సాగించాలని కోరారు.
ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మపరిశీలన జ్ఞానాన్ని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నట్లు చెప్పారు.
ఈ పోస్టులో ఆయన ఏ నాయకుడి పేరును నేరుగా ప్రస్తావించలేదు.





