వదినతో వివాహేతర సంబంధం.. తన పెళ్లికి అడ్డొస్తోందని గొంతు నులిమి హత్య చేసిన మరిది!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో పింకీ అనే మహిళను ఆమె మరిది అనూప్ కుమార్ గొంతు నులిమి హత్య చేశాడు. తన వివాహానికి అడ్డుపడుతోందనే కారణంతోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అనూప్ కుమార్, పింకీ మధ్య వివాహేతర సంబంధం ఉంది. అనూప్‌కు మరో యువతితో పెళ్లి నిశ్చయం కావడాన్ని పింకీ వ్యతిరేకించినట్లు సమాచారం.
దీంతో ఆమెను హత్య చేసి, ఏమీ తెలియనట్లు అనూప్ నటించాడు. పోలీసుల దర్యాప్తులో అనూప్ ప్రమేయం బయటపడటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మృతురాలు పింకీకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమె మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది.





