హై కోర్ట్ లో ఎగ్ డొనేషన్ కేస్ పై కీలక విచారణ

హైకోర్టులో ఎగ్ డొనేషన్ కేసుపై కీలక విచారణ జరుగుతోంది. పలు IVF సెంటర్ల డాక్టర్ల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఎగ్ సేకరణలో తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని IVF నిర్వాహకులు పేర్కొన్నారు.
ఒక మహిళ జీవితకాలంలో ఒకటే ఎగ్ ఇవ్వగలదని, హార్మోనల్ ఇంజెక్షన్ల ద్వారా 7 ఎగ్లు ఇవ్వగలదని పిటిషనర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదించారు.
ఎగ్ సేకరణలో హార్మోనల్ ఇంజెక్షన్లు ఇవ్వడం దోపిడీ కాదా అని హైకోర్టు ప్రశ్నించింది.
ఒక గేదె రోజుకు 1 లీటర్ పాలు ఇస్తుందని, ఎక్కువ పాలు కోసం హార్మోనల్ ఇంజెక్షన్లు ఇస్తే దాని ఆరోగ్యం పాడవుతుందా అని హైకోర్టు ఉదాహరణతో ప్రశ్నించింది.
ఏజెంట్లు చేసిన తప్పిదాలకు తమను బలి చేయవద్దని IVF న్యాయవాది కోరారు.
ART చట్టం డాక్టర్లకు వర్తిస్తుందని, ఏజెంట్లకు కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
IVF సెంటర్లు తప్పు చేస్తే ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని, పోలీసులకు సంబంధం లేదని IVF న్యాయవాది వాదించారు.
వాదనలు కొనసాగుతున్నాయి.





