తెలుగు ఎడిషన్ · 23 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అంజనేయపురం ఆలయ కూల్చివేతపై జగన్ ఆగ్రహంశంషాబాద్‌లో AIMIM నేత ముర్తుజా పహిల్వాన్ దారుణ హత్యసద్దాం హుస్సేన్ బోయింగ్ విమానాల విక్రయం.. ఒక్కోదానికి 9 లక్షల డాలర్లుఅర్ధరాత్రి ఇంటికి వచ్చిన పెద్దపులి... వీడియో వైరల్‌ప్రకృతి ఒడిలో పెళ్లి పందిరి.. రసాయనాల్లేని విందు భోజనంసింహాచలంలో చందన దీక్షలుయాపిల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లు..రైలు ప్రయాణాల్లో కొత్త నిబంధనలుఅంజనేయపురం ఆలయ కూల్చివేతపై జగన్ ఆగ్రహంశంషాబాద్‌లో AIMIM నేత ముర్తుజా పహిల్వాన్ దారుణ హత్యసద్దాం హుస్సేన్ బోయింగ్ విమానాల విక్రయం.. ఒక్కోదానికి 9 లక్షల డాలర్లుఅర్ధరాత్రి ఇంటికి వచ్చిన పెద్దపులి... వీడియో వైరల్‌ప్రకృతి ఒడిలో పెళ్లి పందిరి.. రసాయనాల్లేని విందు భోజనంసింహాచలంలో చందన దీక్షలుయాపిల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లు..రైలు ప్రయాణాల్లో కొత్త నిబంధనలు
వాతావరణం
📅 తేదీ వారీగా

సింహాచలంలో చందన దీక్షలు

ఆధ్యాత్మికంవిశాఖపట్నం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానంలో చందన దీక్షా మాలాధారణ వైభవంగా మొదలైంది.

తొలి విడతలో 546 మంది భక్తులు స్వామివారి సన్నిధిలో దీక్షను స్వీకరించారు. స్వామివారి సన్నిధి నుంచి చందన దీక్షా మాలలను మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి, పాంచరాత్రాగమ శాస్త్ర విధానాన్ని అనుసరించి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, అర్చక బృందం, వేద పండితులు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.

దీక్షా కాలంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్వామివారిని స్మరిస్తూ పూజలు నిర్వహించుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించడం వంటి నియమాలను ఆచరించాల్సి ఉంటుందని ప్రధాన అర్చకులు తెలియజేశారు.

రెండో విడత చందన దీక్షా మాలాధారణ కార్యక్రమాన్ని డిసెంబర్ 2న నిర్వహించనున్నారు.

చందన దీక్షా విరమణ కార్యక్రమాన్ని 2027 జనవరి 2న నిర్వహించనున్నారు.

భక్తులు సుమారు 40 రోజుల పాటు తులసి మాల, దీక్షా వస్త్రాలతో ఈ దీక్షను ఆచరిస్తారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు