రైలు ప్రయాణాల్లో కొత్త నిబంధనలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రైలు ప్రయాణికుల కోసం రైల్వే బోర్డు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత కోచ్‌లలో ప్రధాన లైట్లు ఆపివేయాలి. నైట్ లైట్లు, రీడింగ్ లైట్లు మాత్రమే వాడుకోవాలి.
అగ్నిప్రమాదాల నివారణ కోసం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ పాయింట్లు నిలిపివేయాలి.
రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మిడిల్ బెర్త్‌ను నిద్ర కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ సమయంలో నిద్రిస్తున్న ప్రయాణికులను టీటీఈలు ఇబ్బంది పెట్టకూడదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే టికెట్ తనిఖీ చేయాలి.
రైలులో ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడటం, స్పీకర్లలో పాటలు వినడం నిషేధం. రాత్రి 10 గంటల తర్వాత ఆహారం అమ్మకాలు ఉండవు.
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు.





