ప్రకృతి ఒడిలో పెళ్లి పందిరి.. రసాయనాల్లేని విందు భోజనం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిలకలగూడెం గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రకృతి సాగు రైతు చింతల వెంకటరెడ్డి తన కుమార్తె వీణ వివాహాన్ని అజిత్‌తో ఘనంగా జరిపించారు.
తన 20 ఎకరాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రం స్ఫూర్తితో ఈ వేడుకను పర్యావరణహితంగా నిర్వహించారు.
ప్లాస్టిక్ రహిత ఏర్పాట్లు, సేంద్రియ ఆహారం, స్థానిక రైతులు పండించిన పంటలతో సంప్రదాయ వంటకాలను వడ్డించారు.
పంట పొలాల్లోనే కాదు, పెళ్లి పందిరిలోనూ ప్రకృతి వ్యవసాయం సాధ్యమని ఈ వివాహం నిరూపించింది.
ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ వేదిక ద్వారా చాటిచెప్పారు.





