హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి హాజరయ్యారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రజల ఆశలు, నమ్మకాలకు అనుగుణంగా అందించే ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.
పెండింగ్ అర్జీలపై నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకుని, యాక్షన్ టేకెన్ రిపోర్టులు అందించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా ప్రజావాణిలో టోకెన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ప్రజావాణి నిర్వహణపై జిల్లా కలెక్టర్‌ను గద్వాల్ విజయలక్ష్మి అభినందించారు.





