సింహాచల క్షేత్రంలో వైభవంగా చిలుకుద్వాదశి ఉత్సవం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో చిలుకుద్వాదశి ఉత్సవం వైభవంగా జరిగింది.
ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు సూచనల మేరకు ఆగమ శాస్త్ర నియమాలతో ఉత్సవ ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం విరామం తర్వాత వేద మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలను నిర్వహించారు.
స్వామివారి శయనబేరం, బేడా తిరువీధి కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.





