తెలుగు ఎడిషన్ · 13 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఏపీకి భారీ పెట్టుబడులు.. సీఐఐ సదస్సులో కీలక ప్రకటనలుSM తో బాధపడుతున్న చిన్నారికి ఇంజక్షన్ ఖర్చు రూ.1 కోటి 40 లక్షలు.2027 యూపీ ఎన్నికల్లో ఒవైసీ, ఆజాద్ కూటమి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పేలిన‌ గ్యాస్ సిలిండ‌ర్ఏపీలో పెట్టుబడుల హోరు తొలిరోజే రూ.5.84 లక్షల కోట్ల ఒప్పందాలుఏపీలో మహిళా నాయకత్వం.. టీడీపీ మేయర్లు, చైర్‌పర్సన్లలో 55 మందికి ఉన్నత చదువులుతమిళనాడులో భారీ చోరీప్రధాని నమో విదేశీ పర్యటనఏపీకి భారీ పెట్టుబడులు.. సీఐఐ సదస్సులో కీలక ప్రకటనలుSM తో బాధపడుతున్న చిన్నారికి ఇంజక్షన్ ఖర్చు రూ.1 కోటి 40 లక్షలు.2027 యూపీ ఎన్నికల్లో ఒవైసీ, ఆజాద్ కూటమి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పేలిన‌ గ్యాస్ సిలిండ‌ర్ఏపీలో పెట్టుబడుల హోరు తొలిరోజే రూ.5.84 లక్షల కోట్ల ఒప్పందాలుఏపీలో మహిళా నాయకత్వం.. టీడీపీ మేయర్లు, చైర్‌పర్సన్లలో 55 మందికి ఉన్నత చదువులుతమిళనాడులో భారీ చోరీప్రధాని నమో విదేశీ పర్యటన
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీకి భారీ పెట్టుబడులు.. సీఐఐ సదస్సులో కీలక ప్రకటనలు

బిజినెస్విశాఖపట్నం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతిపై ఆయన వివరించారు.

ఏపీకి 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. విశాఖ పోర్టు ఏటా 10 కోట్ల టన్నుల కార్గోను నిర్వహిస్తోంది. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల ద్వారా మూడేళ్లలో రవాణా సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

జూన్ 2024 నుండి ఇప్పటివరకు రూ. 22.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. ఇందులో 73% ప్రాజెక్టులకు అనుమతులిచ్చాం. 51% ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యి 12.7 లక్షల ఉద్యోగాలు కల్పించాయి.

భారతదేశ ఏసీ తయారీలో 60%, రొయ్యల ఎగుమతుల్లో 80%, కోకో 40%, ఎండుమిర్చి 40%, పొగాకు 50% ఏపీ వాటా ఉంది. పండ్ల ఉత్పత్తిలో 16% వాటాతో పాటు చేపలు, గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం.

ఆటోమొబైల్ తయారీ రంగం నుండి దాదాపు 100 దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. కాగ్నిజెంట్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా 25,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి.

కొత్తగా ప్రారంభమైన భోగాపురం విమానాశ్రయం గురించి ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, జీఎంఆర్ గ్రూప్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు