తిరుమలకు శ్రీ కృష్ణదేవరాయలు ఇచ్చిన బంగారం ఎంత.. శాసనాల్లో అసలు లెక్కలివే

తిరుమల ఆలయానికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన బంగారు కానుకల వివరాలు శాసనాల్లో ఉన్నాయి.
1513 నుంచి 1521 మధ్య ఏడుసార్లు తిరుమలను సందర్శించిన రాయలు, వేల కొద్దీ బంగారు నాణేలు, ప్రత్యేక కానుకలు, ఆలయ స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని సమర్పించారు.
1513 ఫిబ్రవరి 10న నవరత్నాలు పొదిగిన బంగారు రత్న కిరీటాన్ని స్వామివారికి కానుకగా ఇచ్చారు.
1518లో ఉదయగిరి విజయం తర్వాత 30 వేల బంగారు నాణేలతో స్వామివారికి కనకాభిషేకం నిర్వహించారు. శాసనాల్లో ఈ నాణేలను కనక రొక్కం లేదా వరహాలుగా పేర్కొన్నారు.
విజయనగర కాలం నాటి బంగారు వరహా నాణెం బరువు సుమారు 3.4 గ్రాములు ఉండగా, ఆ 30 వేల నాణేల బరువు 100 కిలోలకు పైగా ఉంటుంది.
ఆనంద నిలయ దివ్య విమానానికి బంగారు తాపడం చేయించడానికి రాయలు నిధులు అందించారు.
రాయల రాణులు తిరుమలదేవి, చిన్నదేవి బంగారు పీతాంబరం, ఉత్సవ ఖడ్గాలు, బాహువలయాలు, కారై, నవరత్న ప్రభావళి, బంగారు పూజా సామగ్రిని అర్పించారు.
మొత్తం బంగారాన్ని ఒకే తూకం కింద లెక్కించకుండా, ప్రతి కానుకనూ విడివిడిగా రాతి శాసనాల్లో రాయించడం అప్పటి విధానం. ఆధునిక కిలోల లెక్కల కంటే ఆలయ గోడలపై ఉన్న ఈ శాసనాల ఆధారంగానే చరిత్రకారులు ఈ కానుకలను అంచనా వేస్తున్నారు.





