వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు, కోటి ఓట్ల లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 90 సీట్లు గెలుచుకోవడం, కోటి ఓట్లు సాధించడం కాంగ్రెస్ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీ ఓట్ల సంఖ్య గతంలో 3,700 నుంచి ప్రస్తుతం 92 లక్షలకు పెరిగిందని ఆయన చెప్పారు.
ప్రభుత్వం కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు, కోటి కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా అందిస్తోంది. 50 నుంచి 52 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
3.42 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల కుటుంబాలు కూడా సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ పథకాల ప్రయోజనాలు పొందుతున్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.





