ప్రజావాణి వాయిదా.. నవంబర్ 27న నిర్వహణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రస్థాయి ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడింది. నవంబర్ 24న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని నవంబర్ 27కు మార్చినట్లు ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి ప్రకటించారు.
కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 24 (మంగళవారం) జరగాల్సిన కార్యక్రమాన్ని నవంబర్ 27 (శుక్రవారం)కు వాయిదా వేశారు. ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారులు ఈ మార్పును గమనించాలి. నవంబర్ 24కు బదులుగా నవంబర్ 27న ప్రజావాణికి హాజరుకావాలని అధికారులు సూచించారు.





