ఆంధ్ర మండపం ఏడాదిలో పూర్తి చేయాలని ఏపీ సీఎం ఆదేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కపులుప్పడ కొండపై ఆంధ్ర మండపం నిర్మాణానికి ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి సీఐఐ సదస్సును ఈ ఆంధ్ర మండపంలోనే నిర్వహించాలని సీఎం ఆదేశించారు. దీని కోసం ఏపీఐఐసీ ఇప్పటికే ఆర్ఎఫ్పీని విడుదల చేసింది.
సముద్ర మట్టానికి 120 మీటర్ల ఎత్తులో, 24 ఎకరాల విస్తీర్ణంలో కపులుప్పడ కొండపై ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
ఇందులో 5000 మంది కూర్చునే సామర్థ్యంతో 3.5 లక్షల చదరపు అడుగుల ఆడిటోరియం ఉంటుంది. అదనంగా 1,50,000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు.





