న్యూయార్క్ ఫెడరల్ హాల్ లో తొలిసారిగా దీపావళి వేడుకలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చారిత్రక ఫెడరల్ హాల్ నేషనల్ మెమోరియల్‌లో తొలిసారిగా దీపావళి వేడుకలు జరిగాయి. అమెరికన్ ప్రభుత్వానికి జన్మస్థలంగా పేరుగాంచిన ఈ నేషనల్ పార్క్ సర్వీస్ చారిత్రక ప్రదేశంలో దీపావళిని నిర్వహించడం ఇదే మొదటిసారి.
పంక్తి దోషి ఈవెంట్స్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రైవేట్, ఇన్విటేషన్-ఓన్లీ గాలా నిర్వహించారు.
జార్జ్ వాషింగ్టన్ ప్రమాణ స్వీకారం చేసిన ఈ చారిత్రక ప్రదేశంలో సంగీత, నృత్య ప్రదర్శనలు, దేశీ వంటకాలు ఆకట్టుకున్నాయి.
సంగీత రామానుజ్ వయోలిన్, నిహాల్ తబ్లా, అవిష్ జైన్ బాలీవుడ్ గాత్రం వినిపించగా.. మన్‌ప్రీత్ తూర్, రూపల్ నహర్, శ్రీ గాయత్రి సుందర్ నృత్యాలు చేశారు. డీజే అక్షర్ సంగీతంతో వేడుక ముగిసింది.
దేశీ గల్లీ వంటకాలు, కిస్మత్ మాక్‌టెయిల్స్, హెచ్ఆర్బిఎల్ డ్రింక్స్, యువరాజ్ సింగ్ భాగస్వామ్యంతో ఉన్న FINO టేకిలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.





