సిడ్నీలో STA కొత్త కమిటీ ఎన్నిక.. పుష్ప కాకాని అధ్యక్షురాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిడ్నీలో సిడ్నీ తెలుగు అసోసియేషన్ (STA) వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆదివారం ఘనంగా జరిగింది.
2026–2027 కాలానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు.
అధ్యక్షురాలిగా పుష్ప కాకాని, ఉపాధ్యక్షుడిగా రమేష్ గొర్ల, కార్యదర్శిగా లక్ష్మి తీర్థం, కోశాధికారిగా ప్రసాద్ ములుకుట్ల ఎన్నికయ్యారు.
జాయింట్ సెక్రటరీగా దేవి పరిమ్యాల, జాయింట్ ట్రెజరర్‌గా రాజేష్ వల్లూరి, ఈసీ సభ్యుడిగా సుమన్ గోపు బాధ్యతలు చేపట్టారు.
ఏజీఎం విజయవంతానికి సహకరించిన జీవిత సభ్యులకు, స్పాన్సర్‌లకు అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.
ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కమిటీని ఎంపిక చేశారు.





