అమెరికా ఎన్నికల్లో KA పాల్ ప్రచారం.. మైక్ జాన్సన్‌కు మద్దతు
అమెరికా ఎన్నికల ప్రచారంలో KA పాల్ బిజీగా ఉన్నారు. అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్‌తో కలిసి ఆయన ప్రచారం చేస్తున్నారు.
మైక్ జాన్సన్ విజయానికి మద్దతుగా 31 ర్యాలీలు నిర్వహించనున్నట్లు KA పాల్ ప్రకటించారు. ఇతర ధనిక స్పీకర్లతో పోలిస్తే జాన్సన్ నిజాయితీపరుడని, అవినీతి లేని నాయకుడని పాల్ ప్రశంసించారు. జాన్సన్ శాసనసభ వ్యవహారాలు చూస్తుండగా, తాను ప్రతిరోజూ ఆయనకు ఫోన్ చేస్తున్నానని ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ప్రార్థన, క్షేత్రస్థాయి కృషి లేకపోతే జనవరి నాటికి జాన్సన్ స్పీకర్ పదవిని కోల్పోయే అవకాశం ఉందని పాల్ జోస్యం చెప్పారు.
బెట్టింగ్ మార్కెట్లలో డెమోక్రాట్లు ఆధిక్యంలో, రిపబ్లికన్లు వెనుకబడి ఉన్నారని పాల్ పేర్కొన్నారు. తనకు ఏడు స్వింగ్ స్టేట్స్, లక్షలాది మంది ఓటర్లపై ప్రభావం ఉందని ఆయన చెప్పారు.
మైక్ జాన్సన్ రోజుకు రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నారని పాల్ తెలిపారు.





