ఫ్రాన్స్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఫ్రాన్స్‌లో ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ 5వ వార్షిక బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఈ వేడుకల్లో 270 మంది పాల్గొన్నారు.
బతుకమ్మ తయారీ, బ్యాండ్ ఊరేగింపు, కోలాటం, పూజలు, బతుకమ్మ పాటలు, నృత్యాలు, భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సంస్థ అధ్యక్షుడు నీల శ్రీనివాస్ నాయకత్వం, నిబద్ధత కీలక పాత్ర పోషించాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
తెలుగు పండుగలు ఎక్కడ జరుపుకున్నా గొప్ప ఆనందాన్ని ఇస్తాయని ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ అధ్యక్షుడు నీల శ్రీనివాస్ పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్నా తెలుగు వారందరం కలిసి పండుగలు జరుపుకోవడం సంతోషకరమని ఆయన తెలిపారు.
అందరి ప్రేమ, సహకారంతో ఈ వేడుకలు అద్భుతంగా జరిగాయని, ప్రతి ఏటా తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తామని కమ్యూనిటీ తెలిపింది.





