అమెరికాలో మ్యాగీ ప్యాకెట్‌పై ‘Cancer Warning’.. నిజంగా ప్రమాదమా?

కాలిఫోర్నియాలో విక్రయిస్తున్న India-made Maggi 2-Minute Masala Noodles ప్యాకెట్‌పై క్యాన్సర్ హెచ్చరిక కనిపించిందంటూ ఓ NRI సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం చర్చకు దారితీసింది.
ఇది కాలిఫోర్నియా ప్రొపోజిషన్ 65 చట్టానికి సంబంధించినది. క్యాన్సర్ లేదా reproductive harm కలిగించే రసాయనాల ప్రభావం ఉండే అవకాశం ఉంటే అక్కడ ఇలాంటి హెచ్చరికలు ఇస్తారు.
అయితే ఈ హెచ్చరిక ఉన్నంత మాత్రాన ఆ ఉత్పత్తి క్యాన్సర్ కలిగిస్తుందని లేదా భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిందని అర్థం కాదని కాలిఫోర్నియా అధికారిక మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
మే 15, 2026న Nestlé Holdings, Nestlé USAపై Maggi 2-Minute Instant Masala Noodlesకు సంబంధించి lead exposure ఆరోపణతో 60-day notice నమోదైంది.
ఇది కేవలం ఆరోపణకు సంబంధించిన regulatory notice మాత్రమే, తుది కోర్టు తీర్పు కాదు.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న హెచ్చరికను చూసి భయపడటమో లేదా పూర్తిగా కొట్టిపారేయడమో కాకుండా, product-specific testing, అధికారిక food-safety standards, regulator findings ఆధారంగానే అసలు ప్రమాదాన్ని అంచనా వేయాలి.





