పరిశ్రమల అభివృద్ధికి బలమైన మౌలిక వసతులు, మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కీలకం: సీఎస్ సంజయ్ జాజు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్‌లోని CTRLS, Welspun పారిశ్రామిక యూనిట్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సందర్శించారు.
సంస్థల కార్యకలాపాలు, భవిష్యత్ అవసరాలు, పారిశ్రామిక వసతులపై ప్రతినిధులతో చర్చించారు. అనంతరం Radial Road No.2 నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పరిశ్రమలకు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించడం ద్వారా పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలు, ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని సీఎస్ పేర్కొన్నారు.
ఈ పర్యటనలో FCDA కమిషనర్ శశాంక, రంగారెడ్డి కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.





