🔥 విశాఖ HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖపట్నంలోని HPCL విశాఖ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి ముందు పేలుడు శబ్దాలు వినిపించినట్లు సమాచారం.
రిఫైనరీ నుంచి భారీగా మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటంతో సమీప ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పలు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రమాదానికి గల కారణం, నష్టం లేదా గాయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.





