“నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది” — జగిత్యాలలో చిన్నారి కన్నీళ్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జగిత్యాల జిల్లాలో ఓ చిన్నారి తనను పెంచుకున్న తల్లిదండ్రుల నుంచి వేరై శిశు సంక్షేమ కేంద్రంలో ఉండటం హృదయవిదారకంగా మారింది.
చట్టపరమైన దత్తత ప్రక్రియ పూర్తికాలేదన్న కారణంతో, మూడేళ్లుగా తమ వద్ద పెరిగిన చిన్నారిని అధికారులు సంక్షేమ కేంద్రానికి తరలించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
చిన్నారిని చూసేందుకు వెళ్లిన సమయంలో “నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది” అంటూ ఏడవడం తల్లిదండ్రులను కలచివేసింది.
హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత తీసుకున్నామని కోర్టును ఆశ్రయించగా, చిన్నారిని తిరిగి అప్పగించాలని అక్టోబర్ 16న హైకోర్టు ఆదేశించిందని కుటుంబం చెబుతోంది. అయినప్పటికీ అప్పగింపులో జాప్యం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.
చిన్నారి ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని, కోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే తమకు అప్పగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.





