అమరావతి: రాజధాని సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సచివాలయం, హెచ్‌ఓడీ టవర్లు 1, 2లో మౌలిక సదుపాయాల పనులకు రూ.768.89 కోట్లతో టెండర్ ఖరారు
టవర్లు 1, 2లో ఎలక్ట్రికల్, ఏసీ, ఫైర్ సేఫ్టీ, లిఫ్టులు, ప్లంబింగ్ పనులు చేపట్టనున్న షాపూర్జీ పల్లోంజీ
టెండర్ అంచనా విలువ కంటే 4.22 శాతం అధికంగా షాపూర్జీ పల్లోంజీ కోట్
టవర్లు 3, 4లో హైసైడ్ ఎంఈపీ పనులకు రూ.708.12 కోట్లతో ఎల్ అండ్ టీకి టెండర్ ఖరారు
ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, ఫైర్ ప్రొటెక్షన్, లిఫ్టులు, ఫైర్ అలారం, ప్లంబింగ్ పనులు చేపట్టనున్న ఎల్ అండ్ టీ
అంచనా వ్యయం కంటే 4.26 శాతం అధికంగా ఎల్ అండ్ టీ టెండర్ ఖరారు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీకి ప్రభుత్వ అనుమతి
మొత్తం రూ.1,477.01 కోట్లతో సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల మౌలిక సదుపాయాల పనులు
అక్టోబర్ 26న జరిగిన 67వ ఏపీసీఆర్డీఏ అథారిటీ ఆమోదం మేరకు Go జారీ





