నాచారంలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేత..

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు..
ఎల్బీనగర్ ఎస్ఓటీ, నాచారం పోలీసుల సంయుక్త ఆపరేషన్...
నాచారం పారిశ్రామిక ప్రాంతంలో 210 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం..
పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.20.10 లక్షలు ఉంటుందని అంచనా వేసిన అధికారులు...
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు గుర్తింపు..
పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పట్టుకున్న పోలీసులు.
రెండు ప్యాకెట్లలో 110 గ్రాములు, 100 గ్రాముల చొప్పున ఎండీఎంఏ గుర్తింపు.
నిందితుడు అజిత్ కుమార్ రాజక్ ది కర్ణాటక రాష్ట్రంగా గుర్తింపు..
బెంగళూరులో గుర్తుతెలియని నైజీరియన్ వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడి.
ఉదయ్ అనే వ్యక్తి ఆదేశాలతో హైదరాబాద్‌లో విక్రయించేందుకు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తింపు.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించిన ఇద్దరు క్యారియర్లు..
ప్రధాన నిందితుడు ఉదయ్ పరారీలో ఉన్నట్లు పోలీసుల వెల్లడి.





