సూరత్ టెక్స్‌టైల్ వ్యాపారి ఉద్యోగులకు దీపావళి బోనస్.. పూజా పళ్లెంలో నోట్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గుజరాత్ సూరత్‌కు చెందిన టెక్స్‌టైల్ వ్యాపారి రామ్‌స్వరూప్ ముండే తన 20 మంది ఉద్యోగులకు దీపావళి బోనస్ ఇచ్చారు.
ప్రతి ఉద్యోగికి రూ.లక్షకు పైగా నగదును బోనస్‌గా అందించారు.
రూ.10 నుంచి రూ.500 వరకు కొత్త నోట్ల కట్టలను పూజా పళ్లెంలో అందంగా పేర్చి ఉద్యోగులకు అందజేశారు.
వాళ్లు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, నా కుటుంబ సభ్యుల్లాంటి వారు అని ఆయన పేర్కొన్నారు.
తమను ఎప్పుడూ ఆదుకుంటానని, కష్టాల్లో తోడుంటానని ఆయన ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.
ఈ బోనస్ అందుకున్న ఒక మహిళా ఉద్యోగి ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉద్యోగుల్లో ఆనందం





