దీపావళి గిఫ్ట్.. తెలంగాణలో కొత్తగా 4.5 లక్షల మందికి పెన్షన్లు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణలో అర్హులైన మరో 4.5 లక్షల మందికి కొత్తగా ‘చేయూత’ పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.
నవంబర్ 8న కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించనున్నారు.
వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత–గీత కార్మికులు సహా అర్హులైన వారికి ఈ నెల నుంచే పింఛన్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి.





