తెలుగు ఎడిషన్ · 7 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజాకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజా
వాతావరణం
📅 తేదీ వారీగా

డిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

రాజకీయంనల్గొండ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. తెలంగాణలో కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎందుకు పూర్తికావడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు విభజన తర్వాత చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టులు నిర్మించి నీటిని తరలించారని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నది ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమయ్యామని ఆమె పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ పాలనలో తొమ్మిదిన్నరేళ్లుగా తొమ్మిది ప్రైవేట్ సర్వేల కోసం కోట్లు ఖర్చు చేసినా నీటి వనరులను గుర్తించలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో తొమ్మిది సర్వేల కోసం ప్రైవేట్ కంపెనీలకు కోట్లు చెల్లించినా, డిండి ప్రాజెక్టుకు నీటి వనరు ఎక్కడి నుండి వస్తుందో ఎప్పుడూ చూపలేదని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం సర్వే లేకుండానే ఏదుల నుండి నీటిని తెస్తామని చెబుతున్నారని, దీంతో తమ భూములు మునిగిపోతాయని రైతులు భయపడుతున్నారని తెలిపారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి డిండి ఎత్తిపోతల పథకానికి నీటి వనరుల గురించి మొదటి రోజు నుండే తెలియదా అని నిలదీశారు.

డిండి ఎత్తిపోతల పథకంపై నల్గొండ రైతుల ఆందోళన.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు