ఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ ఆల్వాల్‌లో ఎక్సైజ్ అధికారులు రెండు చోట్ల దాడులు నిర్వహించారు. లోతుకుంటలో మాన్యం నాగప్రసన్న ఇంట్లో 96 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు. క్యాంటీన్ కోటా ద్వారా మద్యం తెస్తుండగా, ఆమె విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. న్యూ బోయిన్‌పల్లి సౌజన్య కాలనీలో మరో 67 బాటిళ్లు స్వాధీనం చేసుకుని మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. రెండు దాడుల్లో కలిపి మొత్తం 163 బాటిళ్లు సీజ్ చేయగా.. వాటి విలువ సుమారు రూ. 2.11 లక్షలు.





