చిట్యాల 7 మిడ్‌వే ప్లాజాలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. విస్తుపోయే నిజాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చిట్యాలలోని 7 మిడ్‌వే ప్లాజాలో TG SAFE అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
వంటగది అత్యంత అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఈగలు, బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
పురుగులు పట్టిన లూజ్ గ్రీన్ మూంగ్ దాల్ (పెసరపప్పు) నిల్వలను తనిఖీల్లో గుర్తించారు.
తుప్పు పట్టిన యంత్రాలు, పురుగులు పట్టిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి.
పనిచేయని పెద్ద గ్రైండర్ తుప్పు పట్టి మురికిగా ఉండటం, గ్రైండింగ్ మెషిన్ దగ్గర బొద్దింకలు ఉండటాన్ని గుర్తించి అధికారులు ఫొటోలు తీశారు.





