అసన్సోల్లో వాంటెడ్ క్రిమినల్ ప్రతాప్ దాస్ లొంగుబాటు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పశ్చిమ బెంగాల్ అసన్సోల్లో సినిమా రేంజ్ యాక్షన్ సీన్ రిపీటైంది.
వాంటెడ్ క్రిమినల్ ప్రతాప్ దాస్ ఇంట్లోనే ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు ఆ ఏరియాను చుట్టుముట్టారు.
అతడు వారిపై కాల్పులు ప్రారంభించడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు.
అతని కాలికి బుల్లెట్ దిగడంతో లొంగిపోయాడు.
ఆ తర్వాత ప్రతాప్‌ను రోడ్డుపై లాక్కెళ్లారు.
ఈ వీడియోలు వైరలయ్యాయి.
సైబర్ క్రైమ్, దోపిడీ కేసుల్లో ప్రతాప్ నిందితుడిగా ఉన్నాడు.
రెండు రోజుల క్రితం పోలీసులపై కాల్పులు జరిపి అతను తప్పించుకున్నాడు.
ఈ రెండు రోజుల ఆపరేషన్ అనంతరం అతను పట్టుబడ్డాడు.





