రేపు రాతిస్తంభంపై దీపం వెలిగించాల్సిందే: సుప్రీంకోర్టు ఆదేశం
తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతిస్తంభంపై కార్తిక పౌర్ణమి నాడు దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు తమిళనాడు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మదురై కలెక్టర్కు అత్యున్నత న్యాయస్థానం ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ సిక్కందర్ దర్గా సమీపంలోని పురాతన రాతిస్తంభంపై దీపం వెలిగించాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది.
కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహించిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ట్రస్టీల బోర్డును సుప్రీంకోర్టు తక్షణమే సస్పెండ్ చేసింది.
తమిళనాడు పోలీసులు విఫలమైనందున, ఆలయం, కొండ భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్కు అప్పగించింది.
రాతిస్తంభం వద్దకు వెళ్లేందుకు పోలీసులు తమను అనుమతించలేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కోర్టుకు తెలిపింది.
కొండ వద్ద భద్రత కోసం 5 వేల మంది పోలీసులను మోహరించామని, నవంబరు 21 నుంచే ASIతో సమావేశాలు జరిపామని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.
Supreme Court expressed severe anger over the failure to light the lamp on the rock pillar on Karthika Pournami.
Supreme Court suspended the temple trustees' board immediately for negligence in implementing court orders.
Security responsibilities at the temple and hill were handed over to central forces CRPF due to the failure of Tamil Nadu police.





