సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీలకు హైకోర్టు జైలు శిక్ష!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు రెండు వారాల జైలు శిక్ష విధించింది.
భూ వివాద కేసులో పిటిషనర్‌కు పోలీసు రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు అధికారులకు రెండు వారాల జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ. 2 వేల జరిమానా విధించింది.
అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలుపై హైకోర్టు వారం రోజుల పాటు సస్పెన్షన్ ఇచ్చింది.





