కూకట్ పల్లి ట్రక్ పార్క్ భూముల వివాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కూకట్ పల్లి ట్రక్ పార్క్ భూములను అమ్మేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపించారు.
రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారు. కొడంగల్ ప్రజలు ఓడించడంతో ఆయన మల్కాజ్ గిరికి వచ్చారు.
ముఖ్యమంత్రి అయ్యాక విలువైన స్థలాలను అమ్ముతున్నారు. కంచె గచ్చిబౌలి భూములను ముంబయి మార్కెట్ లో తాకట్టు పెట్టారు.
మెట్రోను బెదిరించి విలువైన భూములను లాక్కుంటున్నారు. మియాపూర్ లోని విలువైన భూములను అమ్ముతున్నారు.
హైదరాబాద్ నగరాన్ని మురికి కుంపంగా మారుస్తున్నారు. రేవంత్ రెడ్డి అక్రమ దందాలు ఎక్కువయ్యాయి.
భూములు అమ్మి పాలన చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని వివేకానంద గౌడ్ పేర్కొన్నారు.
ట్రక్ పార్క్ భూముల నిరసన ఇంతటితో ఆగదు. న్యాయ పోరాటం చేసి భూములను కాపాడుతామని ఆయన స్పష్టం చేశారు.





