22 ఏళ్ల బీటెక్ విద్యార్థి ఇంట్లో గంజాయి సాగు.. మొక్కలు పెంచి విక్రయిస్తుండగా అరెస్ట్!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లోని బాలాజీనగర్, సంతోషినగర్ ప్రాంతంలో ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతూ విక్రయిస్తున్న 22 ఏళ్ల బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు.
మల్కాజిగిరి జోన్ ఎస్‌ఓటీ, జవహర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
నిందితుడి నుంచి 2 గంజాయి మొక్కలు, 4 గ్రాముల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 5 వేలుగా అంచనా వేశారు.
ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





